AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షిరిడీ భక్తులకు శుభవార్త.. రూ.3 వేలకే మూడు రోజుల షిరిడీ టూర్

ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి దేశంలోని వేర్వేరు పర్యాటక ప్రాంతాలకు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. హైదరాబాద్ నుంచి షిరిడీకి (Hyderabad to Shirdi) కూడా పలు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఓ టూర్ ప్యాకేజీ ధర రూ.3,000 మాత్రమే. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ, శనిశిగ్నాపూర్ కవర్ అవుతాయి. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ బుధవారం హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీటూరిజం సాయి సన్నిధి పేరుతో అందిస్తున్న ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

Day 1: ఐఆర్‌సీటీసీ సాయి సన్నిధి టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు బుధవారం సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయల్దేరే అజంతా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి.

Day 2: అజంతా ఎక్స్‌ప్రెస్ రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. పర్యాటకులు అక్కడ్నుంచి షిరిడీ బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఫ్రెషప్ కావాలి. ఆ తర్వాత షిరిడీలో సాయిబాబా ఆలయ దర్శనం ఉంటుంది. సొంత ఖర్చులతోనే షిరిడీలో సాయిబాబాని దర్శించుకోవాలి. సాయిబాబా దర్శనం పూర్తైన తర్వాత సాయంత్రం 4 గంటలకు శనిశిగ్నాపూర్ బయల్దేరాలి. శని ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నాగర్‌సోల్ బయల్దేరాలి. రాత్రి 9.20 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కాలి.

Day 3: పర్యాటకులు మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ ధర
ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ వేర్వేరు కేటగిరీల్లో అందుబాటులో ఉంది. నలుగురి నుంచి ఆరుగురు కలిసి బుక్ చేసుకుంటే ప్యాకేజీ తక్కువ ధరకే లభిస్తుంది. స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.3,170, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.3,700 చెల్లించాలి. కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.4,860, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.5,390 చెల్లించాలి.

ANN TOP 10