అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. అంతలోనే ఘోరం. పెళ్లికూతురు ఆత్మహత్య చేసుకుంది. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి చింతల్ బాపు నగర్ లో నిషిత కుటుంబం నివాసం ఉంటోంది. నిషితకు 23 సంవత్సరాలు. నిషితకు మేడ్చెల్ మండలం డబిల్ పురా గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డితో సంబంధం కుదిరింది. కుటుంబ సభ్యులు ఇద్దరిని చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు.
అంగరంగా వైభవంగా పెళ్లి జరిపించారు. వధువును తీసుకు అత్తింటి వారు ఇంటికి వెళ్లారు. 16వ రోజు పండక్కు పుట్టింటికి వచ్చిన నవ వధువు నిషిత కుటుంబ సభ్యులను చూసి చాలా ఆనందంగా గడిపింది. తరువాత ఏం జరిగిందో ఏమో గానీ .. గదిలోకి వెళ్లిన నిషిత ఎంతసేపైన బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు కొట్టిన నిషిత నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో తలుపులు బద్దలకొట్టి లోనికి వెళ్లి చూడగా.. నిషిత ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిషితను కిందికి దించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గాంధీ హాసుపత్రికి కు తరలించారు. అత్తింటి వారే వేధించడం వలనే నిషిత ఆత్మహత్య చేసుకుందిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి జరిగి 16 రోజులుకూడా కాలేదని, అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిరచదని వాపోయారు. నిషిత ఆత్మహత్యకు కారకులైన అత్తింటి వారిపై కఠిచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.









