చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, నడికుడి-మిర్యాలగూడ, గుంటూరు-వికారాబాద్. సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూజ్ కాగజ్ నగర్ రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రీషెడ్యూల్ చేశారు. హౌరా-సికింద్రాబాద్, త్రివేండ్రం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మన్మాడ్ రైళ్లు, మరో ఐదు రైళ్లు మే 20, 21 తేదీల్లో ఆలస్యంగా నడుస్తాయి. హౌరా-సికింద్రాబాద్ రైలు (12703) 20వ తేదీ ఉదయం 8.35 గంటలకు బయల్దేరాల్సి ఉండగా దానిని 11.35 గంటలకు మార్చారు.
సికింద్రాబాద్-మన్మాడ్ రైలు (17064) రాత్రి 18.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది కానీ రాత్రి 9.50 గంటలకు బయలుదేరనుంది. అలాగే, మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరాల్సిన భూషణేశ్వర్-ముంబై CSM(11020) 6.20కి, త్రివేండ్రం-సికింద్రాబాద్ ఉదయం 6.45కి బయలుదేరి 8.45కి, విశాఖపట్నం-ముంబై ఎల్‌టీటీ మధ్యాహ్నం 11.20 గంటలకు, మధ్యాహ్నం 1.2.00 గంటలకు బయలుదేరుతుంది.మరోవైపు వేసవి ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా సికింద్రాబాద్ నుంచి దానాపూర్, దిబ్రూగఢ్‌లకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.









