AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబరాన్నంటిన కాంగ్రెస్ సంబరాలు

కర్నాటక విజయంతో దేశవ్యాప్తంగా కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుతూ, బాణాసంచా కాలుస్తూ, డ్యాన్సులు చేస్తూ.. విజయోత్సవాల్లో మునిగిపోయారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, బీజేపీకి కాలం చెల్లిందని అన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఇన్నాళ్లు ఓపిగ్గా ఎదురుచూశారని.. ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.

ANN TOP 10