
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో కాంగ్రెస్ భారీ మేజార్టితో ముందుకు దూసకుకుపోతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 108 సీట్లు గెలుచుకోగా 23 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 51 స్థానాలలో విజయం సాధించగా 17 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. జెడిఎస్ 16 స్థానాలలో గెలుపొందగా 5 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాలలో గెలుపొందారు.
కన్నడనాట కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందన్నది ఎన్నికల ముందు నుంచే వస్తున్న టాక్. పోలింగ్‌కు ముందు.. ఆ తర్వాత వచ్చిన సర్వేలు సైతం చాలా వరకు కాంగ్రెస్ గెలుస్తుందనే చెప్పాయి. అయితే.. ఆ అంచనాలకు మించి కాంగ్రెస్ 130 సీట్లతో దూసుకెళ్తోంది. కర్ణాటకలో మొదలై దక్షిణాదిన పాగా వేయాలని భావించిన బీజేపీకి కాంగ్రెస్‌లో సగం సీట్లలో కూడా గెలిచే పరిస్థితులు లేకపోవడం గమనార్హం. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah).. తెలంగాణ నుంచి బండి సంజయ్ (Bandi Sanjay), ఈటల రాజేందర్ (Etela Rajender) లాంటి పెద్ద తలకాయలు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేసినచోటే దాదాపు బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడం కాంగ్రెస్‌కు మంచి కిక్కిచ్చే పరిణామమేనని చెప్పుకోవచ్చు.









