AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మా నాన్నే కర్ణాటక ముఖ్యమంత్రి కావాలి

సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయపథాన దూసుకుపోతుండటంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఇంకా పూర్తిస్తాయి స్పష్టత రాకముందే మాజీ సీఎం సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘మా నాన్నే సీఎం’ అని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మెజారిటీ సాధిస్తుంది. కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం ఉంది. బీజేపీని అధికారం నుంచి దూరం చేయడానికి మేం ఏం చేయడానికైనా సిద్ధం. కర్ణాటక ప్రయోజనార్థం మా నాన్నే ముఖ్యమంత్రి అవ్వాలి’’ అని యతీంద్ర అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, తన తండ్రి సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన చెప్పారు. భారీ మెజారిటీ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ ఒక కొడుకుగా మా నాన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయన చివరి పాలన బావుందని కర్ణాటకకు చెందిన ఒక పౌరుడిగా చెబుతున్నానని యతీంద్ర వివరించారు.

ANN TOP 10