రామనగర జిల్లాలో చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున సీపీ యోగీశ్వరావు లీడ్‌లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి గంగాధర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కింగ్ మేకర్ అవుతారని అనుకున్న జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి తాజా పరిస్థితి ఇలా ఉండటంతో కర్నాటకలో సంచలనగా మారింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు కేవలం 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో ఆ పార్టీ ప్రభావం పెద్దగా లేదని తేలిపోయింది.
కర్నాటకలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వం ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోనుంది. కౌంటింగ్ మొదలై ఫలితాలు వస్తున్నాయి. కన్నడ ప్రజలే కాదు.. అటు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.









