బాక్సాఫిస్ వద్ద దుమ్ము రేపిన పలు సినిమాలు.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో సినిమాలు ఆడుతున్నప్పటికీ.. కరోనా కాలం నుంచి ప్రేక్షకుల ఆసక్తి ఓటీటీల వైపు మళ్లింది. దీంతో వారికి నచ్చినట్టుగానే థియేటర్లలోనే కాకుండా సినిమాలను ఓటీటీల్లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
మెగా హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్తి మీనన్ నటించిన విరూపాక్ష బాక్సాఫిస్ ను బద్దలుకొట్టింది. ఊహించని రీతిలో వసూళ్లు రాబట్టి.. గ్రాండ్ సక్సెస్ ను ఇచ్చింది. ఏప్రిల్ 21 వ రిలీజైన ఈ సినిమా.. వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా జోరు ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓటీటీలో ఎందరో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 20వ తేదిన ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
అదేవిధంగా స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం, గత నెలలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించపోయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. నేటి నుంచి అమెజాన్ ప్రైంలో ఈ సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విక్రమ్ వేద సినిమా కూడా మే 12న స్ట్రీమింగ్ కానుంది. గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన ఈ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ బాక్సాఫీసు వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం ‘భేడియా’. గతేడాది నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ఈ నెల 26 నుంచి జియో లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు.