హైదరాబాద్ మహానగరంలో ఉగ్రవాదుల కదలికల కలకలం సృష్టించాయి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) 16మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిలో భోపాల్ కు చెందిన 11 మంది ఉండగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ఉండటం విశేషం. ఇవాళ మధ్య ప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారి వద్ద నుంచి జిహాదీ మెటీరియల్, కత్తులు, ఎయిర్‌గన్స్ స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్‌లో ఉదయం నుంచి కొనసాగుతున్న దాడులు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు.
హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న 15 మందిని అరెస్ట్ చేసి భోపాల్ తీసుకెళ్లిన మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక కేసులో భాగంగా హైదరాబాద్‌లో నిఘా పెట్టిన భోపాల్ పోలీసులు. తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి మధ్యప్రదేశ్ పోలీసులు నిఘా పెట్టారు.
కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. 18 నెలలుగా రాడికల్ ఇష్లామ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా సమాచారం ఉంది. వారికి సంబంధించిన వివరాలను సేకరించారు. అయితే ఇక్కడి వీరితో సంబంధాలు కలిగినవారి కోసం కూడా వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది.