హైదరాబాద్ నుండి శనివారం రాత్రి విజయవాడ చేరుకున్న ఇండిగో ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. నిన్న రాత్రి ఏడున్నర గంటలకు ఇండిగో విమానం హైదరాబాద్ నుండి బయలుదేరింది. ఇందులో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే తిరుగు ప్రయాణంలో సాంకేతిక కారణాలతో రన్ వే పైన నిలిచింది. విమానాశ్రయ అధికారులు అక్కడకు చేరుకొని, ఆ విమానాన్ని పార్కింగ్ ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత ప్రయాణీకులను ప్రత్యామ్నాయ సర్వీసు ద్వారా హైదరాబాద్ తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.