కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుతూరు ఇంటర్ ఫెయిల్ అయిందని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పట్టణంలోని ఏఎన్నార్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఇంటర్ ఫలితాలు ప్రకటించింది. ఏఎన్నార్ నగర్‌కు చెందిన గౌతమి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది. అయితే ఓ సబ్జెట్లో గౌతమి ఫెయిల్ అయింది. దీంతో ఆమె తండ్రి మందలించాడు. మనస్థాపం చెందిన గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
కూతురు ఇంటి నుంచి వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేని తల్లి ఆదిలక్ష్మీ తాను ఇక బ్రతికుండి వ్యర్థమని భావించింది. పట్టణ శివారులోని ఓ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కూతరు ఇంటర్ రిజల్స్ తల్లి ప్రాణం మీదకు వచ్చాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.