AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా వీవీఐపీ, వీఐపీల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో వాహనాలను అనుమతించకుండా రోడ్లను క్లోజ్ చేయనున్నారు.

వీవీ విగ్రహం-నెక్లెస్ రోటరీ-తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ- పీవీఎన్ఆర్ మార్గ్ -నల్లగుట్ట మార్గాలను పూర్తిగా మూసివేయనున్నారు. వీవీ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, నల్లగుట్ట జంక్షన్, మింట్ కాపౌండ్ రోడ్, బడా గణేష్ జంక్షన్ రోడ్లు మూసివేసి ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వీవీ విగ్రహం జంక్షన్, పాత సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కాపౌండ్ జంక్షన్, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుంట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ల వైపు ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. వాహనదారులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10