జమ్ముకశ్మీర్‌లో గురువారం సైనిక వాహనంపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పూంఛ్ జిల్లాలోని బాటా దోరియా ప్రాంతంలో దట్టమైన అడవుల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతంలో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారో కనిపెట్టేందుకు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో భద్రతా సిబ్బంది ముమ్మరంగా వెతుకుతున్నారు.









