ఆమెరికాలోని ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్ నగర్‌కు చెందిన వీరా సాయేశ్ (25) మృతి చెందారు. ఎంఎస్ చేయడానికి వెళ్లిన సాయేశ్ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఓ దొంగల ముఠా వచ్చి విధుల్లో ఉన్న అతణ్ని తుపాకీతో కాల్చారు. సాయి తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోయారు. తల్లి, అన్నయ్య ఉన్నారు. సాయేశ్ 2021 నవంబరులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు.









