ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాసేవలో దూసుకెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డిపై అధికార బీఆర్ఎస్ అక్కసు వెల్లగక్కింది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్న కంది శ్రీనివాస రెడ్డి పై విషంకక్కే ప్రయత్నం చేసింది.
సొంతగడ్డకు సేవ చేయాలన్న సదుద్దేశ్యంతో అమెరికా నుండి ఆదిలాబాద్ లో అడుగుపెట్టారు కంది శ్రీనివాస రెడ్డి. అనుకున్నదే తడవుగా అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలతో ఆదిలాబాద్ బిడ్డలకు దగ్గరయ్యారు. వారి కష్టాలను తీరుస్తూ.. ఒక అన్నలా.. తమ్ముడిలా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.
సేవ చేయాలనే ఆలోచనలో భాగంగా ఆయన ప్రాణాదాత అంబులెన్స్ లు ప్రారంభించి.. పేద ప్రజల ఆయువుకు అండగా నిలుస్తున్నారు. అంతేకాదు నిత్యం వందలాది మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ.. ఆకలి తీస్తున్నారు. శ్రీనన్న పెళ్లి కానుక పేరిట ఆడబిడ్డల వివాహాలకు సాయం చేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి అపద్భాంధవుడిలా నిలుస్తున్నారు. సాయం కోరుతు వచ్చిన వారికి చేయందిస్తున్నారు. ఇలా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
అంతేకాదు ఆదిలాబాద్ అభివృద్ధిని మరిచిన స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే జోగా రామన్న, ఆయన తనయుడు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ల అరాచకాలను నిలదీస్తూ.. వారు చేస్తున్న దోపిడిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారి అవినీతిని ఓడించడమే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు.
బస్తీ బాట పేరుతో ఆదిలాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గల్లీలోనూ పర్యటిస్తూ.. ప్రజల గోస వింటున్నారు. మురికి కూపాల వంటి కాలనీల్లో ప్రజలు గుడిసెలు వేసుకుని జీవించడం.. స్లమ్ ఏరియాలో పేదప్రజలు కష్టాలను ఎదుర్కోవడం… కంది శ్రీనివాస రెడ్డిని తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి దీనస్థితికి కారణమైన స్థానిక పాలకులపై విరుచుకుపడుతున్నారు.
ఈ క్రమంలోనే కంది శ్రీనివాస రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని.. సమస్యలు చెప్పుకోడానికి వచ్చే ప్రజలకు చేరువగా ఉండాలని ఆదిలాబాద్ పట్టణంలో ప్రజాసేవాభవన్ పేరిట క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఆయన పట్టణ వాసులకు ఇబ్బంది కలగకుండా.. ప్రజా సేవా భవన్ కు వచ్చే సందర్శకులకు వీలుగా సొంత నిధులతో నాళాలు కట్టించారు.అప్పటి నుండి ప్రజాసేవ భవన్ కు స్థానికులు సమస్యలతో క్యూ కడుతున్నారు. శ్రీనన్న నువ్వే దారి చూపించాలంటూ క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.వచ్చిన వారికి కాదు అనకుండా తన శక్తి మేర సాయం చేస్తూ.. సమస్యలు పరిష్కరిస్తున్నారు. అంతేకాదు ప్రయాణికులు, వలస కూలీలు, పేదలు, స్థానిక ప్రజలు.. ఇలా ఎందరో ప్రజా సేవా భవన్ లో అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఇలా రోజు రోజుకు ప్రజా సేవా భవన్ కు ప్రజలు క్యూ కట్టడం.. కంది శ్రీనివాస రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార బీఆర్ఎస్ .. ఆయనపై దుశ్చర్యలకు ఒడిగట్టింది. ప్రజా సేవా భవన్ కు వచ్చే వారిని అడ్డుకునేలా.. కంది శ్రీనివాస రెడ్డి చేస్తున్న సంక్షేమ, సేవా కార్యక్రమాలకు అంతరాయం కలిగించేలా..కంది శ్రీనన్న సేవలకు కల్లెం వేసేలా దౌర్జన్యాలకు పాల్పడింది. అభివృద్ది పేరిట కంది శ్రీనివాస రెడ్డిపై ప్రతీకార చర్యలకు పాల్పడింది.
ప్రజాసేవాభవన్ దగ్గర తన సొంత నిధులతో కంది శ్రీనివాస రెడ్డి నిర్మించిన నాళాను.. ఆదిలాబాద్ మున్సిపల్ యంత్రాంగం ద్వారా కూల్చివేతలకు పాల్పడ్డారు.ఇలా పాలకుల ఆగడాలను ప్రశ్నిస్తున్న ప్రజాగొంతుకను అణిచివేసేలా..అధికార పార్టీ దుశ్య్చర్యలకు పాల్పడటాన్ని కంది శ్రీనివాస రెడ్డి, ఆదిలాబాద్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.జోగు రామన్న నిర్లక్ష్యాన్ని, అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కుట్రలు చేస్తున్నారని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.ఆదిలాబాద్ ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని.. ఎన్ని దాడులు చేసినా ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.













