భూమిపూజ చేసిన మంత్రులు
చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమిపూజ చేసిన మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం దీన్ని నిర్మిస్తున్నాం. జాతీయ రహదారి మీద ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ఇక్కడ ఏర్పాటు చేశాం. అత్యవసర సమయాల్లో హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్యం పొందటం వీలవుతుంది. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించి, తద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యం గురించి రూ. 1300 కోట్ల పనులు చేసుకుంటున్నాం. ఇందులో చాలా వరకు పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయి. నల్లగొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉంది. ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేసీఆర్ ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారు.
నాంపల్లి, మునుగోడు, చండూరు, నారాయణ్ పుర్ పి హెచ్ సి 24 గంటల పాటు ఉండేలా చేస్తాం. తెలంగాణ వచ్చాక సీఎం గారు నల్గొండకు ఎంతో చేశారు. రాష్ట్రం వచ్చాక నాలుగు ఇస్తే, రెండు మెడికల్ కాలేజీలు నల్గొండ, సూర్యాపేట ఇచ్చారు. ఎయిమ్స్ అతీగతీ లేదు. ఓపీ తప్ప, ఐపీ లేదు. 2018 ప్రారంభంఅయితే మొన్న వచ్చి మోడీ భూమి పూజ చేసారు. ఎయిమ్స్ పై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ గారు ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంబించారు. ఈ ఏడాది మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. నాడు మూడు ఉంటే, నేడు 102 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మారు మూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం.









