AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో స్థానిక ఎన్నికలకు రిపోలింగ్ కు జగన్ డిమాండ్..!

ఏపీలో మళ్లీ ఎన్నికల హింస మోదలైందని అన్నారు. రాష్ట్రంలో ఓటర్లకు చంపేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా జగన్ ఫైర్ అయ్యారు. పోలింగ్ ఏజెంట్లపై దాడులు ఏజెంట్లను అడ్డుకున్నారని జగన్ ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పేపర్లు చోరీ చేశారని విమర్శించారు.

రాష్ట్రంలో పోలీసుల సహకారంతో భారీగా రిగ్గింగ్ జరిగిందని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్న జగన్ విమర్షించారు. అహోబిలంలో భూమా అఖిలప్రియ కాన్వాయ్ వాహనం వైసీపీ శ్రేణులపైకి దూసుకెళ్లిందని జగన్ అన్నారు. మంగంపేటలో పోలింగ్ ఏజెంట్లపై కూటమి శ్రేణుల దాడి చేసారని ఈ దాడిలో ఏజెంట్ చేయి విరిగింది జగన్ ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు బాధ్యులైన పోలీసు, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

ANN TOP 10