AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్పీకర్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను: తాతా మధు..!

మహిళ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్‌ శాసన సభ్యులపై జరిగిన దాడి, దాష్టికానికి ప్రభుత్వమే ముమ్మాటికీ బాధ్యత వహించాలని మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా వారి చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం దారుణం అని అన్నారు. దీనికి తోడు పోలీసులు మాపై అసభ్యకరంగా ప్రవర్తించారని తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు.

‘నేను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారు. అసహనంతో నేను అనని మాటలని స్పీకర్ కు ఆపాదించారు.’అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. నేను మాట్లాడిన వ్యాఖ్యలు స్పీకర్ ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు.

మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా డొక్కలో పోలీసులు పిడిగుద్దులు గుద్దారన్నారు. నా డొక్కలో పిడిగుద్దులు గుద్దిన నేను ఏం మాట్లాడలేదన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన మా ఎమ్మెల్యేల పై దాడి చేశారన్నారు. మహిళా శాసన సభ్యుల పై పోలీసులు దాడి చేశారని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేల పై జరిగిన ఘటనకు హోం శాఖ మంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలను మంగళవారం కౌన్సిల్‌లో మాట్లాడతానన్నారు.

ANN TOP 10