AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు. కూటమిగా సఖ్యతగా ఉండాలని, పార్టీలోని నేతల మధ్య ఎలాంటి గ్యాప్‌లు ఉండకూడదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లలో పోటీచేసే వారిలో సమర్థవంతమైన మహిళా నేతలను గుర్తించాలని అన్నారు.

 

టమి ప్రభుత్వం వచ్చాక చాలా సమస్యలు పరిష్కరించాంమని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, అది స్థానిక ఎన్నికల్లో ప్రతిఫలించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించే అంశం మీదే నా ధ్యాస.. నా ఆలోచన అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనతో పాటు.. పార్టీకి ప్రతి రోజూ సమయం కేటాయిస్తున్నామని అన్నారు. 2029 ఎన్నికల్లో 2024 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇందులో తిరుగులేదని సీఎం చంద్రబాబు స్పష్ఱం చుశేశారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం.. అభివృద్ధి పనులు చేపడుతున్నాంమాని తెలిపారు...

టార్గెట్ పెట్టుకుని పెట్టుబడులు తెస్తున్నాం ఉపాధి కల్పిస్తున్నామని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని, ఆ ప్రాధాన్యతాంశాలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. ఈ తరహా సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, ఏయే ఎమ్మెల్యేలు బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేస్తారో.. వారు వచ్చే సమావేశంలో ప్రజెంట్ చేయాలని క్లారిటీ ఇచ్చారు.

ANN TOP 10