AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేటీఆర్ ఫైర్..!

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను నెరవేర్చలేదనే విషయం తెలపండం కోసమే నేడు ఈ నల్ల టీషర్ట్స్ వేసుకుని నిరసన తెలపడానికే మేము ప్రయత్నించామని కేటీఆర్ అన్నారు. ఇలా వచ్చిన మాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి కావాలనే మాపై దాడి చేసారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మేలపై పోలీసులు మాట్లాడే విధానం మా ఆగబిడ్డలపై దుర్బాషలాడుతూ అతి దారుణంగా మాపై దాడి చేసారని కేటీఆర్ అన్నారు. మా నాయకులను గిల్లీ గిచ్చి అతి దారుణంగా దాడి చేసారని అన్నారు. నాయకులు జగదీశ్వర్ రెడ్డి సృహతప్పి పడిపోయారని, యాదవరెడ్డి, డా సంజయ్‌కి గాయాలయ్యాయని తెలిపారు. చీరలు లాగడం, ఆడపిల్ల జుట్టు లాగడం ఇదేనా మీ ఇందిరమ్మరాజ్యం అంటూ ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను అమలు చేయక పోవడంతో ప్రజలకు మోసం చేయడానికే చూస్తుందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాపై కుట్ర చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా మాపై కక్షసాదింపు చర్యలు పాల్పడుతున్నారని అన్నారు. సభలో మైకు ఇచ్చినట్టే ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడటం విమర్షిచవద్దు వని అని చెప్పడం దారుణం అని అన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రజా సమస్యలను సభలో చెప్పనియ్యకుండా మా మైకులను బంద్ చేయడం మాపై ఎందుకింత వివక్ష అని కేటీఆర్ అన్నారు.

శాసన సభలో మాపై వివక్షచూపడం తగదని కేటీఆర్ అన్నారు. సభలో మమ్ములు మాట్లాడనియ్యకుండా మాపై నింధుల వేయండం దారునం అని అన్నారు. అందరి సభా హక్కులను మీరే కాపాడాలని అంతే గాని ముఖ్యమంత్రిని విమర్షిస్తే మీకు మైకు ఇవ్వను అనే హక్కు మీకు లేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, హక్కులు అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించడం మావిది అని అంతేగాని సీఎం విమర్షిస్తే మైకియ్యను అనే హక్కు మీకు లేదని కేటీఆర్ అన్నారు.

ANN TOP 10