AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న ఇరుముడి..!

ఇరుముడి.. ఇరుముడి.. ఇరుముడి.. ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే తెగ చక్కర్లు కొడుతుంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఇపుడు బాస్ ఆఫ్ ది బాక్సాఫీస్ అన్నట్టుగా అయిపొయింది.టాక్సిక్ వచ్చినప్పటికీ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఇరుముడి సినిమా ఇపుడు మరింత జోరు చూపించేలా కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.26 కోట్ల గ్రాస్ వసూలు చేసిఈ 2026లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో టాప్ 5 లో చోటు దక్కించుకోవడం విశేషం.ఇందులో ఒక్క ఇండియాలోనే దాదాపు 20కోట్లపైగా వసూల్లని రాబట్టడం విశేషం.

ఇక ఈ లిస్టులో ఉన్న మొదటి నాలుగు సినిమాలని చూస్తే.. పెద్ది సినిమా రూ.116 కోట్లు కొల్లగొట్టగా, ‘ది రాజా సాబ్’ రూ.96 కోట్లతో రెండో స్థానం దక్కించుకుంది.ఇక చిరు నటించిన మన శంకర వర ప్రసాద్ గారు’ రూ.72 కోట్లతో మూడోస్థానంలో నిలిస్తే,పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.52.8 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.మొతానికి అసలే సక్సెస్ లు లేక డీలా పడ్డ రవితేజకి ఇరుముడి సూపర్ హిట్ ని అందించడమే కాకుండా ఈ ఏడు టాప్ 5లో నిలపడం విశేషం.ఇక ఇప్పుడున్న జోరు చూస్తుంటే సినిమా ముందు ముందు మరిన్ని రికార్డులని తన ఖాతాలో వేసుకునేలానే ఉంది.

ఇక ఈ మధ్య హిట్ తెచ్చుకున్న సినిమాలని చెప్పుకుంటున్న మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ వంటి సినిమాల కన్నా ఇరుముడి మొదటి రోజు వసూళ్లు బెటర్ గా ఉండటం చూస్తే మాస్ మహారాజ్ రవితేజ మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా రోజూ వారి కలెక్షన్స్ ని చూస్తే తొలిరోజు రూ.26 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.27 కోట్లు, నాలుగో రోజున రూ.19 కోట్లు కొల్లగొట్టగా ఆరోజు రోజు కూడా ఎక్కడా డ్రాప్ చూపెట్టకుండా ఏకంగా రూ.14 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా సెంచరీ మార్క్ క్రాస్ చేసి 125 కోట్ల దాటేసి దూసుకుపోతుండటం విశేషం.ఇక కొన్ని చోట్ల ఇరుముడి థియేటర్లు టాక్సిక్ కి వేస్తున్నారంటూ మళ్ళీ ఇరుముడి సినిమానే ప్రదర్శించాలని ధర్నాలు చేయడం చూస్తుంటే సినిమా ఈజీగా 150 కోట్ల మార్క్ ని అవలీలగా దాటేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమాని దాదాపు రూ.45 కోట్లతో నిర్మించినట్టు తెలుస్తుంది.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాకి దాదాపు రూ.22 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.

మొత్తానికి పెట్టిన బడ్జెట్ కి నాలుగింతలు వసూలు చేస్తుండటంతో మాంచి హ్యాపీ మోడ్ లో కనిపిస్తుంది మూవీ టీమ్.చూడాలి మరో జోరుగా పడుతున్న ఈ కలెక్షన్ల వర్షం ఎప్పుడు తెరిపినిస్తుందో !

ANN TOP 10