టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అయిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న(Rashmika Mandanna)కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్ గా కొనసాగుతున్న ఈ జంట గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విజయ్ రష్మిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడంతో పెద్దల సమక్షంలో ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇలా పెళ్లి తర్వాత రష్మిక విజయ్ తమ కెరియర్ పరంగా బిజీగా గడుపుతూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి నటించిన రణబాలి సినిమా(Ranabaali) ప్రమోషన్లలో భాగంగా కాఫీ విత్ కరణ్ టాక్ (Koffee With Karan Talk)షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ రష్మిక గురించి చేస్తున్న కొన్ని వ్యాఖ్యల పట్ల నేటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా రెడ్ ఫ్లాగ్ అంటూ ట్రోల్ చేశారు. అదేవిధంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ విడాకుల వార్తలను కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
ఇలా విజయ్ దేవరకొండ రష్మిక వైవాహిక జీవితం గురించి అలాగే వీరి మధ్య విభేదాలు వచ్చాయని విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై విజయ్ రష్మిక ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని, కొంతమంది మమ్మల్ని చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఘాటుగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తమ గురించి దుష్ప్రచారం చేస్తున్న వారి పట్ల విజయ్ దేవరకొండ రష్మిక మేనేజర్ నిశాంత్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
నిశాంత్ కుమార్ సైబర్ క్రైమ్ డీసీపీను ఆశ్రయించి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక గురించి ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కాఫీ విత్ కరణ్ షోలో భాగంగా వీరు చేసిన వ్యాఖ్యలపట్ల కొంతమంది తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ ఆధారాలతో సహా డీసీపీకి అందజేశారు. ఇలా విరోష్ మేనేజర్ నిశాంత్ కుమార్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై విచారణ జరిపి తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ సైబర్ క్రైమ్ డీసీపీ తెలియజేశారు.







