ప్రధాని మోడీకి లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే లేఖ రాసారు. నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వాయిదాలో జాప్యం, నిన్న ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రస్తావించిన ప్రత్యేక పార్లమెంటు సమావేశం జరిగే అవకాశం గురించి ప్రధాని మోదీకి లేఖ రాసారు. ప్రస్తుత లోక్‌సభ సంఖ్యా బలాన్ని 543 వద్ద మరో 25 సంవత్సరాల పాటు కొనసాగించాలన్నారు.
లోక్‌సభలో ప్రస్తుత రాష్ట్రాల వారీ బలాన్ని మరో 25 సంవత్సరాల పాటు కొనసాగించాలని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలను చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
డి లిమిటేషన్ ప్రతిపాదనలను అధ్యయనం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత సమయం ఇవ్వాలన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సమస్య అని, గత ఏప్రిల్ 16, 17 తేదీలలో బలవంతంగా బిల్లు తెచ్చినట్లు బలవంతంగా బిల్లు తీసుకురావడానికి ప్రయత్నించవద్దని అన్నారు.








