AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హీరోయిన్లతో కేటీఆర్ దుబాయ్ వెళ్లారు: వెంకట్ బల్మూర్.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. కేటీఆర్ తన పేరును మార్చుకుని ఇద్దరు హీరోయిన్లతో కలిసి దుబాయ్ వెళ్లారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

‘రామ్ కేటీ’, ‘కే రామ్’ అనే పేర్లతో కేటీఆర్ ఇద్దరు హీరోయిన్లు, మరో ఇద్దరు ప్రముఖులతో కలిసి దుబాయ్‌కు వెళ్లారని ఆరోపించారు. ఎవరికీ దొరక్కుండా ఉండేందుకే హైదరాబాద్ నుంచి నేరుగా కాకుండా, బెంగళూరు, ఢిల్లీ మీదుగా ప్రయాణించారని పేర్కొన్నారు. తాను చెబుతున్నవి అబద్ధమైతే, తన కొడుకు మీద ఒట్టేసి చెప్పగలరా అని కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు.

కేటీఆర్ ఒక రాక్షసుడని, ఆయన వల్ల మహిళలకు ప్రమాదమని, ఆయన భయంతోనే టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు తెలంగాణలో సినిమాలు తీయలేకపోతున్నారని వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా విమర్శించారు. గతంలో వైసీపీ అధినేత జగన్ తో కేసీఆర్ ఎందుకు చర్చలు జరిపారని, వైసీపీ నేత రోజా ఇంట్లో రొయ్యల కూర ఎందుకు తిన్నారని పాత విషయాలను కూడా ప్రస్తావించారు.

ANN TOP 10