బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణబ్’ తుపాను ప్రభావంతో భారతీయ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా పలు బులెటిన్లను విడుదల చేసింది. ముఖ్యంగా అక్టోబర్ 27, 28 తేదీల్లో 53 రైలు సర్వీసులపై ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను బట్టి రైళ్ల రద్దు వివరాలను గమనించి, స్టేషన్లకు బయల్దేరే ముందు రైలు స్టేటస్‌ను తప్పనిసరిగా సరిచూసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న మార్గాల్లో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లను నవంబర్ మొదటి వారం వరకు కూడా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను గమ్యస్థానానికి ముందే నిలిపివేయడం లేదా ప్రారంభ స్టేషన్‌ను మార్చడం వంటి చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
నవంబర్ వరకు పూర్తిగా రద్దయిన రైళ్లు
దక్షిణ కోస్తా రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కింద పేర్కొన్న రైళ్లను సుదీర్ఘ కాలం పాటు రద్దు చేశారు








