AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం..!

ఏ హానీ జరగకుండా చూసుకోవాల్సిన వారే ఆ చిన్నారి పాలిట రాక్షసులయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వరుసకు అన్నలయ్యే ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది చూసి మందలించాల్సిన మేనమామ కూడా అత్యాచారం జరిపాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

 

6వ తరగతి చిన్నారి..

కీసర ప్రాంతానికి చెందిన బాధిత చిన్నారి తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు సంతానం. చిన్న భార్యకు ఓ కూతురు ఉంది. ఆ బాలిక యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ 6వ తరగతి చదువుతోంది. ఇటీవలే సెలవుల కోసం ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేనపుడు వరుసకు అన్నలయ్యే ఇద్దరు ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది చూసిన మేనమామ అడ్డుకుని వారికి బుద్ది చెప్పాల్సింది పోయి తాను కూడా అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి బాధితురాలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతూ వస్తోంది.

 

పరార్‌లో ఇద్దరు..

చివరకు పక్కింట్లో ఉంటున్న వారికి జరిగిన విషయం చెప్పింది. వారి ద్వారా విషయం తెలిసి బాధితురాలి కుటుంబ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి నిందితుల్లో ఒకన్ని అరెస్ట్ చేసినట్టు సీఐ ఆంజనేయులు తెలిపారు. మిగితా ఇద్దరు నిందితులు మహారాష్ట్రకు పారిపోయినట్టుగా తెలిసిందన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించి నింబోలిఅడ్డలోని బాలికల జువెనైల్ హోంకు తరలించారు.

ANN TOP 10