ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోడి అని వైఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య ఉద్యమం అని కొనియాడారు. విపక్ష నేత రాహుల్ గాంధీజీ పోరాటానికి దక్కిన విజయం అని అన్నారు. బెదిరింపులకు జడవకుండా, కేసులకు భయపడకుండా ధర్నా చేశారన్నారు.
యువతకు నా అభినందనలు..
లాఠీ దెబ్బలకు ఓర్చుకుంటూ, రక్తాన్ని సైతం చిందించి, మంత్రిని గద్దె దించే వరకు అలుపెరగని పోరాటం చేసిన ప్రతి విద్యార్థికి, యువతకు నా అభినందనలు అని వైఎస్ షర్మిల తెలిపారు. మత పిచ్చి బీజేపీ అహంకారానికి, ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూసే కుట్రలకు ఇది చెంపచెల్లు అని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలకు గట్టి సమాధానం ఇదే అని ఫైర్ అయ్యారు.
భవిష్యత్తుతో చెలగాటం..
విద్యాశాఖ మంత్రి రాజీనామా దేశ ప్రజల్లో పెరిగిన అసంతృప్తికి నిదర్శనం అని, బీజేపీ అంతానికి తొలిమెట్టు ఇదే అని అన్నారు. నీట్ పేపర్ లీకులను దాచేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా.. ఉద్యమాన్ని తొక్కిపెట్టాలని చూసినా విద్యార్థి శక్తి ముందు చివరకు తలవంచడం మోదీజీ అండ్ కో కి చెంపపెట్టు అని అన్నారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే యువత తగిన సమాధానం చెప్తుందని నిరూపించిన సందర్భమిదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల హక్కులను రక్షించేందుకు, ప్రజా వ్యతిరేక విధానాల అంతానికి ప్రజలతో కలిసి కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని తెలిపారు.








