AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామ్ చరణ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “పెద్ది” తో గేమ్ ఛేంజర్ డిజప్పాయింట్మెంట్ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేసిన ఈ సినిమా 400 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టి రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

 

ఇక ఇదిలా ఉండగా చరణ్ నుంచి తదుపరి బుచ్చిబాబుకి గురువు అయినటువంటి దర్శకుడు సుకుమార్ తో చరణ్ సినిమా ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ మాసివ్ కాంబినేషన్ లో రానున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

 

దీని ప్రకారం ప్రస్తుతం సుకుమార్ మొత్తం స్క్రిప్ట్ ని లాక్ చేసి చరణ్ కి ఫైనల్ నరేషన్ వినిపించినట్టు తెలుస్తుంది. చిన్న చిన్న మార్పులు చేర్పులు తర్వాత సుకుమార్ అండ్ కాంబో ఈ ఏడాది అక్టోబర్ నుంచి ముహూర్త కార్యక్రమాలతో ఈ బిగ్ ప్రాజెక్ట్ ని చేయనున్నట్టుగా తెలుస్తుంది.

 

సో అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ కాంబినేషన్ పై అభిమానులకి ఇదొక సాలిడ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఇతర తారాగణం సాంకేతిక వర్గానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. అలాగే ఈ రంగస్థలం కాంబినేషన్ ని అదే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ANN TOP 10