కేటీఆర్, హరీష్‌రావు పై బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ చీకటి ఓప్పందాలు మోత్తం మాకు తెలుసని అన్నారు. కేటీఆర్, హరీష్‌రావు కేంద్రంలోని మోదీ, అమిత్ షాల ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. కేంద్రం తరహాలోనే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని, కావాలన మీ అవయవాలను అమ్మేసి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారని అన్నారు.
తెలంగాణలో 8 ఎంపీ సీట్లు..
కేద్రం ప్రభుత్వం ఆనాటి నుండి ఉన్న ప్రభత్వ సంస్థలను నేడు ప్రైవేటు వ్యక్తుల ఇస్తున్నారని అన్నారు. ఇటు కేటీఆర్ ని తొక్కుకుంటూ అటు బీజేపీ పార్టీకి సపోట్ చేస్తున్రారని ఫైర్ అయ్యారు. నేడు తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలవడం వెనుక వారి అంతర్గత వ్యవహరం ఉందని ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో కేటీఆర్ హరీష్ రావు బీజేపీ పార్టీలోకి వెళ్లడం ఖాయమని బీర్ల ఐలయ్య విమర్శించారు.








