AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సామాన్యుడికి జేబుకు మళ్లీ చిల్లు.. పెట్రోల్-డీజిల్ ధరలు పెంచిన కంపెనీలు, లీటర్‌కు ఎంతంటే..!

దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరలను మరోసారి పెంచింది కేంద్రం. ఇది వాహనదారులకు ఊహించని షాక్ తగిలింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరు సుమారం 90 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఆయిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన ప్రతీసారి ఈ వడ్డన తప్పదనే సంకేతాలు మొదలయ్యాయి.

 

దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరలు మళ్లీ పెంచిన కంపెనీలు

 

దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరలు మంగళవారం పెరిగాయి. లీటర్‌పై 90 పైసలు చొప్పున పెంచుతూ సంబంధిత ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారంరోజుల్లో ఆయిల్ ధరలు పెంచడం రెండోసారి. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77 నుంచి 98.64 కు పెరిగింది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ. 90.67 నుంచి 91.58కి చేరింది.

 

పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సరఫరాపై ఒత్తిడి తీవ్రమైంది. ఫలితంగా ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. నాలుగు రోజుల కిందట లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా లీటర్‌పై 90 పైసలు చొప్పున ఇప్పుడు వడ్డించింది.

 

సామాన్యుడికి జేబుకు మళ్లీ చిల్లు.. లీటర్‌కు 90 పైసలు నుంచి రూపాయి వరకు

 

వివిధ రాష్ట్రాల్లో విధించే పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా ఈ పెంపు లీటర్ కు రూపాయి వరకు ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఆయిల్ ధర పెంపు నేపథ్యంలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.89 కి చేరింది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.98.96 కు వద్ద ఉంది. పెరుగుతున్న ఆయిల్ ధర ప్రభావంతో రవాణా రంగంపై అదనపు భారాన్ని మోపింది.

 

ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుంది. ఫలితంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. మార్కెట్ అనుకూలంగా ధరలు పెంచాలని ఆయిల్ భావిస్తున్నాయి. ఆ విధంగా ప్రచారం సాగుతోంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మార్కెట్ ఆధారంగా ఆయిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు అదే కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

పెట్రోల్‌, డీజిల్ ధరలు మంగళవారం వివిధ నగరాల్లో ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో రూ.98.64, కోల్‌కతాలో రూ.109.70, ముంబై రూ.107.59, చెన్నై రూ.104.49 ఉన్నాయి. ఇక డీజిల్ ధరల విషయానికి వద్దాం.. ఢిల్లీలో రూ.91.58, కోల్‌కతాలో రూ.96.07, ముంబై రూ.94.08, చెన్నై రూ.96.11లుగా ఉంది

ANN TOP 10