AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్..?

పూజా హెగ్డే …ఈ అమ్మడు లేకపోతే ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు లేవనే పరిస్థితి .ఆ రకంగా టాలీవుడ్ ని ఏలేసింది మరి.

సినిమాల పరంగానే చూస్తే అల్లు అర్జున్ తో అలవైకుంఠపురంలో, మహేష్ బాబు తో మహర్షి ,ఎన్టీఆర్ తో అరవింద సమేత ,ప్రభాస్ తో రాధే శ్యామ్,చరణ్ తో ఆచార్య అంటూ వరుసగా టాప్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేసింది అమ్మడు.

 

అయితే అలాంటి ఈ భామకి ఇప్పుడు అస్సలు కాలం కలిసి రావడం లేదని టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది.ఒక రకంగా చెప్పాలంటే ఈ బుట్ట బొమ్మ కెరీర్ 2022 నుంచే డౌన్ ఫాల్ అయిందని చెప్పాలి .ఏ ముహూర్తాన రాధే శ్యామ్ సినిమాని ఒప్పుకుందో కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బొక్క బోర్లా పడటంతో పూజా కెరీర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది.మార్చి 11న ఆ సినిమా రిలీజ్ కాగా అదే ఏడు ఏప్రిల్ 29న వచ్చిన ఆచార్యఈ భామకి మరింత పీడ పీడకలనే మిగిల్చింది.

 

అక్కడ కూడాసరైన సక్సెస్ రాని పరిస్థితి

 

ఇక అలా కాదంటూ బాలీవుడ్ బాట పట్టిన ఆ భామకి అక్కడ కూడాసరైన సక్సెస్ రాని పరిస్థితి,రక్షాబంధన్ ,సర్కస్, కిసీకా భాయ్ కిసీకా కా జాన్ అంటూ ఇలా ఏ సినిమా చేసిన బోల్తా పడ్డవే .దీంతో ఈ భామ ఏ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఆ ఇండస్ట్రీలో ప్లాపులు మూట కట్టుకోవాల్సిందేనా అన్న మాటలు వినిపించాయి .

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ నెల 23న వచ్చిన జననాయగన్ కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో పూజా భామ పని అయిపోయిందన్న టాక్ వినిపిస్తుంది.

 

ఇక ఇక సినిమాలో విజయ్ యాక్షన్ ,పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గురించి ఎక్కువ డిబేట్లు పెట్టేశారు కానీ పూజ పాత్ర గురించి ఎవరు మాట్లాడింది లేదు.పైగా ఎడిటింగ్ లోనే ఆమెకు చెందిన కొన్ని సీన్లు తొలగించారని వార్తలు వినిపించాయి .నిజమేటో మేకర్స్ చెప్పకపోయినా ఈ వార్త మాత్రం తెగ సర్కులేట్ అయింది.

 

ఒక్కో సినిమాకి నాలుగు నుంచి 6 కోట్లు

 

అయితే ఇన్ని ప్లాపులు మూట కట్టుకున్న ఈ భామ ఎక్కడా తన పారితోషికాన్ని తగ్గించకపోవడం గమనార్హం. అవును గతంలో ఒక్కో సినిమాకి నాలుగు నుంచి 6 కోట్లు తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు అంతకి ఒక్క రూపాయి కూడా తగ్గనని డిమాండ్ చేస్తుందట. దీంతో అంతమేమిచ్చుకోలేమంటూ శ్రీలీల, మీనాక్షి చౌదరి ,భాగ్యశ్రీ బోర్సే కయాదు లోహర్, మమత బైజు వంటి కొత్త బామ్మల దిక్కు చూస్తున్నారట ఆ నిర్మాతలు.

 

అల్లు అర్జున్, లోకేష్ కనకరాజు సినిమాలో హీరోయిన్ ఛాన్స్

 

అయితే తాజాగా ఈ భామకి అల్లు అర్జున్, లోకేష్ కనకరాజు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దొరికింది అన్న టాక్ వినిపిస్తుంది అలాగే ఆగస్టులో సెట్స్ మీదికి వెళ్లే రవితేజ కొత్త సినిమాలోను ఈ భామే నటిస్తుందన్న టాక్ వినిపిస్తుంది.అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి .

ఒకవేళ ఈ సినిమాలు కనుక నిజంగానే కమిట్ అయిపోయి సక్సెస్ చూస్తే మాత్రం బుట్ట బొమ్మ మరో రెండు మూడేళ్లు ఇండస్ట్రిని ఏలడం ఖాయం. అలాకాకుండా సినిమాలు ఏ మాత్రం తేడా కొట్టిన ఈ బుట్ట బొమ్మ సర్దుకోవడం పక్కా. అయితే ఇండస్ట్రీలో ప్లాపులు చూసినా మళ్ళీ ఒక్క సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన సందర్భాలు బోలెడు .మరి బుట్ట బొమ్మ అలాగే కమ్ బ్యాక్ ఇస్తుందా లేక నావల్ల కాదంటూ వరుస ప్లాపులు మూటగట్టుకుని సర్దుకుని పోతుందా చూడాలి

ANN TOP 10