AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీ మార్పు వార్తలపై మల్లారెడ్డి క్లారిటీ..

రాజకీయ వర్గాల్లో గత కొద్ది రోజులుగా తన పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారానికి బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి చెక్ పెట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న ఆయన, తాను బీఆర్‌ఎస్‌ను వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారమేనని స్పష్టం చేశారు.

 

తాను పార్టీ మారుతున్నాననే రూమర్లను నిజమని నమ్మి ఒక అభిమాని తన సొంత రక్తంతో లేఖ రాయడం తనను ఎంతగానో కలచివేసిందని మల్లారెడ్డి తెలిపారు. త్వరలోనే ఆ అభిమానిని నేరుగా కలిసి మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ… కేటీఆర్ 125 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆరే ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆయన్ను సీఎం పీఠంపై చూడటమే తన ప్రధాన లక్ష్యమని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

ANN TOP 10