సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మణుగూరు ఏరియాలోని ఓపెన్ కాస్ట్-2 (OC-2) బొగ్గు గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి గనిలో కార్మికులు మట్టి తొలగింపు పనులను చేస్తున్నారు. దీనికి అక్కడ అత్యంత ఖరీదైన బ్రహ్మపుత్ర షావల్ అనే యంత్రంతో పనిచేస్తున్నారు. అయితే పనిచేసే చేస్తున్న సమయంలో యంత్రం ఓక్కసారిగా ప్రమాదానికి గురైంది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పోగతో కమ్ముకుంది. ఓక్కసారిగా యంత్రం మోత్తం చూట్టూ మంటలు వ్యాపించి కాలి పోయింది. దీని విలువ సమారు కోట్లో ఉంటుందని కనీసం 6 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అక్కడి అధికారులు తెలపారు.
ప్రాణ నష్ట్రం..
రోజులాగే అందరూ పనులు చేస్తుండగా దట్టమైన మట్టిని తొలగించే క్రమంలో యంత్రంలోని ఇంజన్ భాగం నుండి చిన్న చిన్న నిప్పురవ్వలు వచ్చి కేవలం నిమిషం సమయంలోనే ఓక్క సారిగా మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఎలాంటి ప్రాణ నష్ట్రం జరగలేదు. మంటలు వచ్చే సమయంలో చాక చక్యంగా వ్వవహరిచిన షావల్ ఆపరేటర్, క్లీనర్ సమయానికి వాహనంలో నుండి కిందకు దూకారు. దీంతో ప్రాణాపాయం నుండి తప్పినట్టైంది.
కార్మిక సంఘాలు ఫైర్..
ఇటీవల కాలంలో సింగరేణిలో వరుస ప్రమాదాలు జరగడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేనిలోని భారీ యంత్రాలకు సకాలంలో ఫిట్‌నెస్ పరీక్షలు, ఓవర్‌హాలింగ్ (మెయింటెనెన్స్) చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు మండిపడుతున్నారు. కేవలం బోగ్గు ఉత్పత్తి టార్గెట్లు రిచ్ అవ్వడం పైన యాజమాన్యం దృష్టిపెడుతుందని కార్మికులపై, యంత్రాలపై అధికారులు గాలికి వదిలేస్తున్నారనే విమర్షలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కారనాలు తెలుసు కొని భాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు.







