AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తొలి పేపర్ లెస్‌గా తెలంగాణ కేబినెట్ సమావేశం..

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలో తొలిసారి పేపర్ లెస్‌గా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎర్పాటు చేశారు. ఘతంలో మంత్రి శ్రీధర్ బాబు ఫైలెట్ ప్రాజెక్ట్ క్రింద దీన్ని ఎర్పాటు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. ఈ-క్యాబినెట్ విధానంలో రాష్ట్రంలోని మంత్రులందరు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం ఎర్పాటు చేశారు.

 

వీబీ జీ-రామ్ పథకం..

అయితే తెలంగాణకు ప్రధాన కార్యదర్శి గా వచ్చిన సంజయ్ జాజుకు ఇది తొలి క్యాబినెట్ సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా మెట్రో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినటువంటి వీబీ జీ-రామ్ పథకం అమలుపై కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉందని కొందరు ప్రభుత్వం అధికారులు అనుకుంటున్నారు. వానాకాలం పంట సాగు పరిస్థితులపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల పంపిణీపై చర్చ ముఖ్యంగా చర్చించనున్నారు.

 

అంతర్రాష్ట్ర బదిలీలపై..

ఈ సంత్సరం పంటల వైవిధ్యం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని కొందరు అధికారులు తెలిపారు. ఏపీ-తెలంగాణ ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై చర్చించనున్నారు. మరియు ఈ సమావేశంలో హైదరాబాద్‌లోని కోర్ అర్బన్‌లో ఎస్ఐజీ హౌసింగ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాతమ్మకంగా తీసుకున్నటువంటి మూసి ప్రక్షాళనం ఫేజ్ 1 పైన చర్చ జరిగే అవకాశం ఉంది.

ANN TOP 10