కేంద్రం ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం సమర్థనీయం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని దీని వలన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.
గత ఎన్నికల్లో..
దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని అన్నారు. ఇటీవల దేశంలో జరిగిన పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చెరి, అస్సాం, తమిళనాడు ఎన్నికలకు ముందు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచుతామని గతంలో మోదీ ప్రభుత్వం పదే పదే ప్రకటించిందని అన్నారు.
పది రోజులు కాకుండానే..
ఎన్నికలు జరిగిపోయి ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 పైగా ధరలు పెంచడం దేశంలో ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని అన్నారు. దేశంలో కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్దాలు చెబుతారని ప్రజలను ఇలా మొసం చేస్తున్నారని అలా భావిస్తున్నారని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.







