అధ్వానంగా ప్రియదర్శిని స్టేడియం
కనీస వసతులు కరువైనా దృష్టిసారించని ఎమ్మెల్యే
క్రీడాకారులు, వాకర్స్ సమస్యలు పరిష్కరించాలి
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఫైర్
ఆదిలాబాద్ : జిల్లాలో క్రీడా మైదానాలు అధ్వానంగా మారాయని, మౌలిక వసతులు కరువయ్యాయని బీజేపీ రాష్ట్రనాయకులు శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని ప్రియదర్శిని స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్‌తో కలిసి నడిచారు. స్టేడియంలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు.
స్టేడియంలో కనీసం టాయిలెట్స్ కూడా లేవని వాకర్స్ వాపోయారు. స్టేడియాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని, ఎమ్మెల్యే జోగురామన్న ఇటువైపు కన్నెత్తిచూడటంలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా కందిశ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జోగురామన్నకు ఇవేవి కనబడవని, ఆయన ధ్యాస అంతా కమిషన్లు, అక్రమ దందాలపైనే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో క్రీడలు ఆడేందుకు సరిపడా మైదానాలు లేవని, కొన్ని చోట్ల ఉన్నా అధ్వానంగా మారాయని అన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, ఇక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. క్రీడాకారులకు, వాకర్స్‌కు అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.