AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందుకే పేపర్ లీక్.. వెలుగులోకి ప్రవీణ్ లీలలు!

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్.. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసింది. విచారణకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు పేపర్ లీక్‌లో ముఖ్య పాత్ర పోషించారని సిట్ నివేదికలో వెల్లడించారు. వీరి ద్వారానే మిగతా వారికి చేరిందని చెప్పారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగుతోందని.., ఇప్పటికే 450 మంది అనుమానితులను విచారించినట్లు వెల్లడించారు. అయితే పేపర్ లీక్ కేసులో కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

పేపర్ లీక్ కారణమైన ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన తండ్రిలా పోలీస్ ఆఫీసర్ కావాలనే పేపర్ లీక్ చేసినట్లు సిట్ విచారణలో ఒప్పుకున్నారు. ప్రవీణ్ తండ్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ ఎస్పీ హోదాలో పనిచేయగా.. విధి నిర్వహణలో ఉండగానే ఆయన చనిపోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కు ప్రభుత్వ ముద్రణా సంస్థలో ఉద్యోగం లభించింది. ఆ తర్వాత అతడు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి బదిలీ అయి.. అక్కడ నమ్మకంగా పనిచేశాడు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. తానూ తన తండ్రిలా పోలీసు ఆఫీసర్ అవుతానుంటూ తరచూ సహచర ఉద్యోగులతో చెప్పేవాడని సిట్ విచారణలో తేలింది.

ANN TOP 10