AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’పై దాడి… సరైన చర్య అంటూ పూనమ్ కౌర్ ట్వీట్..

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించిన ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ ఘటనను సమర్థిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఇలాంటి చర్యలు అవసరమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

 

ఈ ఘటనపై పూనమ్ కౌర్ స్పందిస్తూ, “మహిళలను, వారి సంబంధాలను అవమానించేలా, పూర్తి స్త్రీ ద్వేషంతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారులు తీసుకున్న చర్య సరైనదే. ఇలాంటి చర్యలు చాలా అవసరం. అలా మాట్లాడేది ఎవరైనా సరే, వారికి ఇలాగే జరగాలి” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, మీడియా ఛానెళ్లపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

 

“నేటి న్యూస్ ఛానెళ్లు బ్లాక్‌మెయిలింగ్ బాక్సులుగా మారాయని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను” అని ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు ఏబీఎన్ ను కూడా ట్యాగ్ చేశారు.

ANN TOP 10