బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అంబేద్కర్ ఉత్సవాల నిర్వహణకు తనవంతుసాయమందించారు.ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.వారిని కంది శ్రీనివాస రెడ్డి సాదరంగా ఆహ్వానించి వారితో ఆత్మీయంగా భేటి అయ్యారు.ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహణ కోసం తనవంతు ఆర్ధికసాయం అందించారు.ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
