బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, జోనల్ ఇంచార్జి సంజయ్ ఘనాటే ఆదిలాబాద్ జిల్లాను సందర్శించారు.పల్లె పల్లెకు ఓబీసీ, ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ కు వచ్చిన ఆయనను.. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన క్యాంపు ఆఫీసుకు ఆహ్వానించారు. సంజయ్ ఘనాటేకు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఆయనకు విరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గిమ్మ సంతోష్‌రావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
