AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమ్మేళనాల పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దు:మల్లు రవి

ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లు రవి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాంధీ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా చీమలపాడులో ఘటన ఎంతో కలిచివేసిందన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతూ.. ఎన్నికల ప్రచారం చేస్తుందని..చీమలపాడులో బీఆర్‌ఎస్‌ శ్రేణులు బాణసంచా కాల్చడం వల్లే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు.

చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున బీఆర్‌ఎస్‌ పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి రూ.25 లక్షలు ఇవ్వడంతో పాటు ఉచిత వైద్యమందించాలని డిమాండ్‌ చేశారు. చీమలపాడు ఘటనపై జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణ చేపట్టాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ANN TOP 10