బీజేపీ నేతలు ఉక్రోషంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ఇంతకాలం చేయని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితులుగా ఉన్న వాళ్లు దర్యాప్తును తప్పు పట్టడం కామన్ అని చెప్పారు.సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను నల్గొండ, ఖమ్మంతో పాటు..ఏపీలో అనేక ప్రాంతాల్లో డ్యూటీ చేశానని సీపీ రంగనాథ్ తెలిపారు. తాను ఎక్కడ చేసినా ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. తన కెరీర్లో ఒక్క దందా చేసినా..సెటిల్ మెంట్ చేసినట్లు నిరూపించినా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేశానని అన్నారు. సత్యం బాబు కేసుపై బండి సంజయ్ కు పూర్తి అవగాహన లేనట్లుందని చురకలంటించారు. ఆ కేసును దర్యాప్తు చేసింది తాను కాదన్నారు. తాను ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వచ్చానని.. ప్రతీ సారి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదన్నారు. చేయమంటే ప్రమాణం చేసేందుకు సిద్దమన్నారు.