AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ లో అధికారముందనే అహం స్పష్టంగా కనిపిస్తుంది: లక్ష్మణ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు..బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ కౌంటరిచ్చారు.తానే గొప్ప విజ్ఞానని..బీజేపీ వాళ్లు అజ్ఞానులు అన్నట్టు మంత్రి కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. విషయ పరిజ్ఞానం ఆయనకు తప్ప ఎవరికి లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారని..అధికారముందనే అహంతో ఇలా మాట్లాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.అబద్దాలను అందమైన ఫ్రేమ్ లో పెడితే ప్రజలు నమ్మరని,ప్రతీ సారి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నారని ఫైర్ అయ్యారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరిపిస్తామన్నారని..ఆ సంగతేమైందని ప్రశ్నించారు.బయ్యారం ఫ్యాక్టరీ విషయంలో విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని క్లారిటీ ఇచ్చారు.

ANN TOP 10