AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిగరెట్ ప్రియులకు భారీ షాక్: రూ.18 సిగరెట్ ఇక రూ.72? నాలుగు రెట్లు పెరగనున్న ధరలు!

కొత్త ఎక్సైజ్ బిల్లు – ధరల పెంపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ‘సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025’ను ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం సిగరెట్లు మరియు పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా పెంచారు. గతంలో 1,000 సిగరెట్ స్టిక్స్‌పై ఉన్న రూ.200 – రూ.735 ట్యాక్స్‌ను, ఇప్పుడు ఏకంగా రూ.2,700 నుండి రూ.11,000 వరకు పెంచారు. ఈ సుంకాల పెంపు అమల్లోకి వస్తే, ప్రస్తుతం మార్కెట్‌లో రూ.18కి లభించే ఒక సిగరెట్ ధర సుమారు రూ.72 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పొగాకు నియంత్రణే లక్ష్యం దేశంలో యువత మరియు విద్యార్థులు ధూమపానానికి బానిస కాకుండా చూడాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధరలు అమాంతం పెరగడం వల్ల సామాన్యులకు, యువతకు ఇవి అందుబాటులో ఉండవని, తద్వారా ధూమపానాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సిగరెట్ రకం మరియు దాని పొడవును బట్టి ఈ పన్ను రేట్లు మారుతూ ఉంటాయి. ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యసనాన్ని అదుపు చేయడమే ఈ బిల్లు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ధరల పెంపు వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ధూమపాన ప్రియులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. “ధరలు పెరగడం వల్ల కనీసం ఇప్పుడైనా ఈ అలవాటును మానుకోవడానికి అవకాశం ఉంటుంది” అని కామెంట్ చేస్తున్నారు. అయితే, ధరలు పెంచినంత మాత్రానికి వ్యసనపరులు మానేస్తారా లేక దీనివల్ల సిగరెట్ల అక్రమ రవాణా (Smuggling) పెరుగుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యాన్ని ఉద్దేశించి కొందరు నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు.

ANN TOP 10