AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాంగ్ మెసేజ్‌తో జీవితం తలకిందులు: ట్రేడింగ్ పేరుతో ప్రైవేట్ ఉద్యోగిని రూ.26.37 లక్షలు మోసం చేసిన మహిళ!

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి అనుకోకుండా వచ్చిన ఒక రాంగ్ మెసేజ్ అతని జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఆ మెసేజ్‌కు రిప్లై ఇవ్వడంతో పరిచయమైన ఒక మహిళ (అన్నమనేని హేమాచౌదరిగా పరిచయం చేసుకుంది), ట్రేడింగ్ వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపింది. క్రమంగా ఆమెపై నమ్మకం పెంచుకున్న ఆ ఉద్యోగి, ఆమె పంపిన లింక్ ద్వారా ట్రేడింగ్ మొదలు పెట్టాడు.

తొలుత ₹50 వేలతో ట్రేడింగ్ ప్రారంభించిన ఆ వ్యక్తికి, నమ్మకం కలిగించడం కోసం ఆన్‌లైన్‌లో లాభాలు వచ్చినట్లు చూపించి, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో మరింత లాభం వస్తుందనే ఆశతో, ఆ ప్రైవేట్ ఉద్యోగి పలు దఫాలుగా ఏకంగా ₹26.37 లక్షలు ట్రేడింగ్‌లో పెట్టాడు. ఆ తర్వాత అతని పెట్టుబడికి లాభంతో కలిపి ₹40.96 లక్షలు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపించారు.

అయితే, ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా వీలు కుదరలేదు. దీంతో అతను పరిచయం చేసిన హేమాచౌదరిని సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆమె సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ట్రేడింగ్ పేరుతో వచ్చే ఇలాంటి రెట్టింపు లాభాల మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

ANN TOP 10