టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూర్‌లోని ఈశా యోగా కేంద్రంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్న తర్వాత, సోషల్ మీడియాలో వివాదాలు మొదలయ్యాయి. ఈ శుభవార్తపై నటి పూనమ్ కౌర్ మరియు సమంత మాజీ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ పెట్టిన పరోక్ష పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సమంత మాజీ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “బాధితురాలిగా విలన్ బాగా నటించింది” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఆమె సమంతను అన్‌ఫాలో చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ వ్యాఖ్యలు సమంతను ఉద్దేశించే చేశారని, నాగచైతన్యతో ఆమె విడాకులకు సంబంధించిన ఏదైనా నిజం సద్నాకు తెలుసేమోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇదే క్రమంలో నటి పూనమ్ కౌర్ కూడా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా “సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం” అంటూ పోస్ట్ చేశారు. సమంతకు రాజ్ నిడిమోరుతో ఇది రెండో వివాహం కావడం, రాజ్ నిడిమోరుకు కూడా గతంలో శ్యామలీతో వివాహం జరిగి విడాకులు తీసుకోవడం వంటి నేపథ్యంలోనే ఈ పరోక్ష విమర్శలు వస్తున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.








