తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం జరిగింది. ఆసుపత్రి భవనంలో రెనోవేషన్ పనులు జరుగుతుండగా, సెంట్రింగ్ కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించినట్లు సమాచారం. స్లాబ్ పెచ్చులు ఊడిపడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వద్ద రెనోవేషన్ పనులు చేస్తుండగా జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
సెంట్రింగ్ కూలిపోవడంపై మరియు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









