AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీం ఇండియా ఓటములకు గౌతమ్ గంభీరే కారణమా?: హెడ్ కోచ్‌పై తీవ్ర విమర్శలు

టీం ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత జట్టు వరుస అపజయాలను ఎదుర్కొంటుండటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు సాధించిన విజయాలను, ప్రస్తుత ఓటములతో పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. గంభీర్ జట్టు ప్రయోజనాలను పక్కన పెట్టి, ఆటగాళ్లను సమిష్టిగా ఆడే పరిస్థితి నుంచి దూరం చేయడం వలనే ఈ వరుస అపజయాలు వస్తున్నాయని పలువురు మండిపడుతున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం, ఇటీవల కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు వైఫల్యం చెందడానికి కూడా గంభీర్‌నే కారణమని వేలు పెట్టి చూపుతున్నారు. కోచ్‌గా ఆటగాళ్లను ప్రేరేపించాల్సింది పోయి, వారిపై తిట్ల పురాణం అందుకుంటే అది వారి ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంభీర్ ఏకపక్ష నిర్ణయాల కారణంగానే భారత జట్టు వరుస ఓటములను మూటగట్టుకోవాల్సి వస్తుందని విశ్లేషణలు జరుగుతున్నాయి.

తాజాగా, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా గౌతమ్ గంభీర్ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ఆటగాళ్లకు సరైన కోచింగ్ ఇవ్వడంలో గంభీర్ విఫలమయ్యాడని తివారీ అన్నారు. అంతేకాక, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోవడానికి కూడా గంభీర్ వ్యవహార శైలి కారణం కావచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ లయ తప్పడానికి కూడా గంభీరే కారణమన్న వ్యాఖ్యలు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ANN TOP 10