నటుడు సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘తెలుసు కదా’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 14 (శుక్రవారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ప్లాట్‌ఫారమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా, సిద్ధు జొన్నలగడ్డ చేసిన ఒక హాస్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “చిల్డ్రెన్స్ డే రోజున ‘తెలుసు కదా’ స్ట్రీమింగ్ పెట్టడం పెద్ద స్పాయిలర్!” అని ఆయన సరదాగా కామెంట్ చేశారు.
టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీతో యూత్‌ఫుల్ హీరోగా ఎదిగిన సిద్ధు, లేడీ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే పాత్ర పోషించారు. రాశీఖన్నా మరియు శ్రీనిధి శెట్టి వంటి స్టార్ హీరోయిన్‌లు నటించిన ఈ చిత్రం అక్టోబర్‌లో థియేటర్లలో మోస్తరు వసూళ్లు సాధించినప్పటికీ, సిద్ధు నటన, రాశీ-శ్రీనిధిల గ్లామర్, మరియు తమన్ అందించిన చార్ట్ బస్టర్ సంగీతం మంచి ప్రశంసలు పొందాయి.
‘తెలుసు కదా’లో వరుణ్ అనే అనాథ యువకుడు, ప్రేమతో నిండిన కుటుంబం కోసం ఆరాటపడే సున్నితమైన భావజాలంతో కథ నడుస్తుంది. మ్యూచువల్ రిలేషన్‌షిప్, కాంప్లెక్స్ ఎమోషన్, అడల్ట్ థీమ్ ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాని పిల్లల దినోత్సవం రోజున రిలీజ్ చేయడాన్ని ఉద్దేశించి సిద్ధు చేసిన ఈ కామెంట్ చర్చకు దారితీసింది. కొందరు అభిమానులు దీన్ని ఫన్ కోసం చేసిన ట్వీట్‌గా భావిస్తుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం నెగిటివ్‌గా స్పందిస్తూ, మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.








