AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జల్ జీవన్ మిషన్‌కు కొత్త ఊపు: కేంద్రం గడువు పొడిగింపునకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచార హడావిడికి దూరంగా ఉండి, పద్ధతి ప్రకారం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కేంద్ర పథకాలు సక్రమంగా అమలుకాలేదని గుర్తించిన ఆయన, లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మందగించడాన్ని గుర్తించి, ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేస్తూ గ్రామాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ఉన్న ముఖ్యమైన కేంద్ర పథకం అయిన జల్ జీవన్ మిషన్ అమలుపై తాజాగా శుభవార్త తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దెబ్బతిన్న జల్ జీవన్ మిషన్‌ను పునరుజ్జీవింపజేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సర్కారు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి, కేంద్రానికి పథకం గడువు పొడిగించాల్సిందిగా అభ్యర్థించారు. దీనికి అనుగుణంగా కేంద్రం జల్ జీవన్ మిషన్ గడువును మరో నాలుగేళ్ల పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాలలో దాదాపు రూ. 7,910 కోట్ల రూపాయల విలువైన తాగునీటి ప్రాజెక్టులు కొనసాగనున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది ప్రజలకు రక్షిత తాగునీరు అందే అవకాశం ఉంది.

ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మెగా తాగునీటి ప్రాజెక్ట్ ప్రత్యేకంగా చెప్పుకోదగినది. గత జూలై 4వ తేదీన రూ. 1,290 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే 30 సంవత్సరాలపాటు 1.21 కోట్ల మందికి రక్షిత నీరు అందించాలన్న లక్ష్యం ఉంది. ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఇది జీవనదాయకంగా మారనుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాలలో కూడా తాగునీటి మెగా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు

ANN TOP 10